రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా హసన్‌పర్తి-కాజీపేట మధ్య నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇరువైపులా పలు రైలు సర్వీసులను నిలిపివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ (ట్రైన్ నం. 17012) మధ్య నడిచే రైలును ఇవాళ రద్దు చేసినట్లు తెలిపింది.
తిరుపతి-కరీంనగర్ (12761), కరీంనగర్- తిరుపతి(12762), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్(12758) మధ్య నడిచే రైళ్లను ఇవాళ పాక్షికంగా నిలివేస్తున్నట్లు పేర్కొంది.
యశ్వంత్‌పూర్- హజ్రత్‌నిజాముద్దీన్(12649),యశ్వంత్‌పూర్-గోరక్‌పూర్(22534), సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్ధీన్(12285) రైళ్ల సర్వీసులు డైవర్షన్ తీసుకుంటాయని ప్రకటించింది.