- Advertisement -
మావోయిస్టులు డౌన్ డౌన్..
Maoists down down..
మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆదివాసీలు,ఆదివాసీ సంఘాలు..
ములుగు
మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం రోజున ఆదివాసీలు, ఆదివాసి సంఘాలు ఏటూరునాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీసి రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రోజున వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు అయినా ఉయిక రమేష్, ఉయిక అర్జున్ ను మావోయిస్టులు ఇన్ ఫార్మర్ నెపంతో హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్, మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపటమే అంటూ నినాదాలు చేస్తూ 3000 మంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు.
- Advertisement -