- Advertisement -
కనకమహాలక్ష్మీ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు
Margasira Masotsavam at Kanakamahalakshmi Temple
విశాఖపట్నం
విశాఖ నగరం బురు జుపేటలో వేంచేసియున్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఆఖరి గురువారం రోజున అమ్మ వారికి విశేష పూజలు నిర్వహిం చారు. ఆలయంలో లక్ష్మీ హోమాల ను అత్యంత భక్తి శ్రద్దలతో జరిపిం చారు. భక్తులు పలువురు అమ్మ వారిని దర్శించుకున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల నేప థ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులుతీరి నిల్చొని అమ్మను దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువలా తరలిరావడంతో బురుజుపేట వీధులు కిక్కిరిశాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మ వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
- Advertisement -