లక్ష్మీ పాలెం లో మార్మోగిన గోవింద నామస్మరణలు
Marmogina Govinda Namsmaranas in Lakshmi Palem
వైభవంగా గరుడ సేవ మహోత్సవంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
బద్వేలు
బద్వేలు నియోజకవర్గంలోని లక్ష్మీ పాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి గరుడ సేవా మహోత్సవంలో సందర్భంగా ఆహ్వానించిన 18 వ వార్డు ఇన్చార్జి మాచుపల్లి రజినీకాంత్ ఆహ్వానం మేరకు విచ్చేసి కంకణ దారుడైన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గరుడ వాహనం మోస్తూ శ్రీవారిపట్ల చాటుకున్నారు. శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై విరవిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తి ప్రీతికి తాను దాసుడని గరుడ వాహనంపై ఊరేగుతూ శ్రీవారు చాటి చెప్పారు. గరుడ వాహన దారుడైన శ్రీవారిని దర్శించుకోవడం సర్వ పాప పరిహరణకు మూలమని వేద పండితులు పేర్కొన్నారు. అంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సుందర్ రాంరెడ్డి, సర్పంచ్ రమణయ్య, వార్డు కౌన్సిలర్లు వరలక్ష్మి, రజిని, వెంకటసుబ్బయ్య, పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు, రఘురాం రెడ్డి, వెంకటసుబ్బయ్య, చాపాటి సాయినారాయణరెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు*