- Advertisement -
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
Married woman died in a road accident
హైదరాబాద్
తన పిల్లలను పాఠశాలలో వదిలి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం లో ఓ మహిళ మృతి చెందింది. అంబర్పేట్ కు చెందిన నీత తన పిల్లలు నాచారం లోని జాన్సన్ స్కూల్ పాఠశాలలో వదలడానికి ఉదయం తన
స్కూటి పై ఇంటికి బయలు దేరింది. నాచారం లోని హెచ్ఎంటి నగర్ వద్ద గ్యాస్ సిలిండర్ల తో వస్తున్న లారీ స్కూటిని ఢీకొట్టడంతో మహిళ లారి చక్రాల క్రింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి
చేరుకున్న పోలీసులు లారి డ్రైవర్ నిర్లక్షం తో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్కూల్ బస్సు రాకపోవడం తో తను పిల్లలను స్కూల్ లో
దింపడానికి వచ్చిందని మృతురాలి బంధువులు తెలిపారు.
- Advertisement -