Wednesday, February 19, 2025

కుంభమేళలో భారీగా స్నానాలు

- Advertisement -

కుంభమేళలో భారీగా స్నానాలు

Mass bathing in Kumbh Mela

న్యూఢిల్లీ, జనవరి 28, (వాయిస్ టుడే)
మహా కుంభమేళా 2025.. ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్‌ రాజ్‌ వైపే.. భక్త జనసంద్రానికి తీరమా.. అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది.. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్‌ రాజ్‌కు పోటెత్తుతున్నారు. డే బై డే రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు . ఇన్ని రోజులు ఒక లెక్క. ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. జనవరి 29 ఈసారి మహాకుంభమేళలో వెరీ వెరీ స్పెషల్‌. ఎందుకంటే ఆరోజు అద్వీతియమైన రోజు. బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినం..మహాకుంభ మేళలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘ మాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ.. గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం.. మౌని అమావాస్య రోజున అందరూ షాహి స్నాన్ ఆచరిస్తారు..మౌని అమావాస్య ధ్యానానికి జ్ఞానానికి చిహ్నం. ఆరోజు మౌనంగా వుంటూ ..పరమేశ్వుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానంచేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసిరావడం మరెంతో శుభప్రదం..ఇప్పటికే మహా కుంభ మేళాలకు కోట్లలో తరలి వస్తున్నారు భక్తులు.ఇక మాఘ మాస మౌన అమావాస్య ఒక్కరోజే పది కోట్లకు మంచి భక్తులు తరలి వస్తారనేది అంచనా. మౌన అమావాస్య కోసం భారత రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికీ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా యూపీ సర్కార్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.ఈసారి ప్రయాగ్‌ రాజ్‌లో యువతరంగాల జోరు వెల్లి విరుస్తోంది. ఎక్కడ చూసినా యువోత్సాహం కనిపిస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా యువత కన్పిస్తున్నారు. భక్తిశ్రద్దలతో కుంభమేళలో పాల్గొంటున్నారు. కుంభమేళాకు వస్తున్న యువత గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.. దేశంలోని యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు ప్రధాని. ఇక మౌని అమావాస్య కోసం దేశ విదేశాల నుంచి యువత ప్రయాగ్‌ రాజ్‌ పయనమైంది. జనవరి 29… బుధవారం.. మాఘమాస మౌని అమావాస్య…మహాకుంభ మేళ సందడి ఇక పక్కగా మరో లెవల్‌ కానుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్