కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.
కూకట్ పల్లి : నవంబర్ 28(వాయిస్ టుడే): ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయమని, ప్రజలకు ఇటువంటి నాయకుడు అవసరమని పలువురు మూసాపేట్ సర్కిల్ పరిధిలోని మూసాపేట్ మరియూ జనతా నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బి నవీన్ గౌడ్ తో కలిసి 80 మంది యువకులు కూకట్ పల్లి బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. అనంతరం నవీన్ గౌడ్ మాట్లాడుతూ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ, లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిస్వార్థ సేవలు అందిస్తున్న ప్రేమ్ కుమార్ ను గెలిపించుకుంటామని, ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కె. కృష్ణ గౌడ్, దివాకర్, చోటు, సాయి, అరవింద్ చందు, ప్రవీణ్ ప్రేమ్ కుమార్, నరసింహారెడ్డి, రాజశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
