Monday, December 23, 2024

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

- Advertisement -

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు :

పెంటపాడు

జనసేన పార్టీ అధినేతపవన్ కళ్యాణ్  ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్  ఆధ్వర్యంలో
పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి అధ్యక్షతన చిలుకూరి శ్రీనివాసరావు మరియు వారి మిత్రబృందం బోడపాడు గ్రామం నుంచి సుమారు 200 మంది జనసేన పార్టీలోకి స్వాగతం పలుకుతూ వారికి కండువా వేసి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా  బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బోడపాడు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి నాకు గత జనసేన పల్లేపోరులో ప్రతి వీధి ప్రతి గుమ్మం తిరిగాను అని ఈ గ్రామంలో ఆడపిల్లలు చదువుకోవడానికి రావిపాడు గ్రామం వెళ్ళాలి అని ఉన్న ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారయణ కానీ వైసీపీ నాయకులు ఈ గ్రామ సమస్యలు పట్టించుకోలేదు అని ఈ గ్రామానికి రావడానికి సరైన రోడ్ లేదు అని కనీసం గుంతలు కూడా పుడ్చలేని అసమర్థ నాయకుడు అని రాజకీయాలలో డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చానని ప్రజాసమస్యలు వారికి పట్టవని మళ్ళీ రాబోయే ఎన్నికలలో ఏ మొహం పెట్టుకొని ప్రజలలో తిరుగుతారు అని ధ్వజమెత్తారు. గ్రామాలకు వస్తున్న నిధులను సైతం ఈ ప్రభుత్వం గ్రద్దలాగా తన్నుకుపోతుంది అని అలాగే ఈ మధ్య వచ్చిన తూఫాన్ వల్ల అప్ లాండ్ లో వున్న రైతుల పంటలు నీటిలో మునిగి చేతికి వచ్చే నష్టపోతే కనీసం ఈ  వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా రైతులను ఆదుకోలేదు అని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలపై పన్నులరూపంలో భారం పెంచుతూ మళ్ళీ పేదలకు పెత్తందారులకు అని మళ్ళీ జగన్ నువ్వే దిక్కు అని పెద్ద హోర్డింగులు సిగ్గులేకుండా పెట్టుకుంటున్నారు అని రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో  తాడేపల్లిగూడెం పట్టణ గౌరవాధ్యక్షులు అడబాల నారాయణమూర్తి పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ వీర మహిళా విభాగంపెంటపాడు మండలం అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, జిల్లా వీర మహిళ విభాగం కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, నియోజకవర్గ జనసేన నాయకులు సోమా శంకర్ యాదవ్, గుండుమోగుల సురేష్, బుద్దన నారాయణ, బోడపాడు గ్రామం జనసేన నాయకులు మట్ట ఆంజనేయులు, పతివాడ బాల సూర్యనారాయణ, పతివాడ శివ, చిలుకూరి వెంకట్రావు, ఆకుల శివ ప్రసాద్, గుండబత్తుల దుర్గారావు, కలిశెట్టి పాపయ్య, పాలూరి నారాయణ, పాలూరి చిన్నారావు, మల్లుల వెంకటేశ్వరరావు, మల్లుల త్రిమూర్తులు,కుందిరెడ్డి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్