- Advertisement -
మాస్ కా దాస్ విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ‘లైలా’ నుంచి పెంచల్ దాస్, మధుప్రియ పాడిన ఓహో రత్తమ్మ సాంగ్ రిలీజ్
Mass Ka Das Vishwaxen, Akanksha Sharma, Ram Narayan, Sahu Garapati, Penchal Das, Madhupriya from Shine Screens 'Laila' Oho Rattamma Song Release
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్సేన్ సోను మోడల్, లైలాగా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం చాలా క్యురియాసిటీ పెంచింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. టీజర్, మొదటి రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు థర్డ్ సింగిల్ ఓహో రత్తమ్మ విడుదలైంది.
లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఓహో రత్తమ్మ అందరినీ అలరించే మాస్ ఫీస్ట్ అందిస్తుంది. ట్రాక్ థ్రింపింగ్ టెంపో ప్రారంభం నుండి ముగింపు వరకు హై ఎనర్జీ ఇచ్చింది. పెంచల్ దాస్, మధుప్రియల జానపద శైలి వోకల్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి, పెంచల్ దాస్ రూరల్, మాస్ సాహిత్యాన్ని అందించారు. సోషల్ మీడియా సెన్సేషనల్ ట్రాక్ కోయారే కోయ్ కోయ్ చేర్చడం పాటకు ఎక్స్ట్రా ఎంటర్ టైన్మెంట్ ని యాడ్ చేసింది.
విశ్వక్‌సేన్ ట్రెడిషినల్ నుంచి అల్ట్రా-స్టైలిష్ వరకు వివిధ రకాల లుక్స్ తో ఆకట్టుకున్నారు, పాటకు డైనమిక్ ఎనర్జీ ని యాడ్ చేశాడు. అతని డ్యాన్స్ మూమెంట్స్ ఎలిగెంట్ గా వున్నాయి. ఆకాంక్ష శర్మ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. సెట్టింగ్‌లు థీమ్‌కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. కొరియోగ్రఫీ వైబ్‌ను మరింతగా పెంచింది. ఈ పాట థియేటర్లలోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు విజల్స్ కోయ్టడం ఖాయం. ఇది అభిమానులకు పూర్తి స్థాయి మాస్ విందు.
లైలా చిత్రానికి స్క్రీన్‌ప్లే వాసుదేవ మూర్తి రాశారు, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది.
తారాగణం: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
- Advertisement -