తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు
పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి
బద్వేలు
బద్వేల్ మున్సిపాలిటీ పెద్ద అగ్రహారం చిన్న అగ్రహారం గ్రామాలకు చెందిన దాదాపు రెండు వందల కుటుంబాలు ఆదివారం రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి వారికి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు బద్వేలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం
జరిగింది కార్యక్రమంలో బద్వేలు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పార్థసారథి కలసపాడు మండల మాజీ జడ్పిటిసి సభ్యుడు భూపాల్ రెడ్డి పార్టీ నాయకులు సింగ సాని విజయ్ కుమార్ ( బుజ్జి ) నాన బాల వెంకటేశ్వర్లు కాల్వపల్లి సర్పంచ్ శ్రీనివాసులు వెంకటేశ్వర్లు జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు