మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
కంట తడి పెట్టిన మాతంగి స్వర్ణలత
Matangi Swarnalatha… the prophecy… Matangi moved to tears.
నా విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయడం లేదు.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలి
నాకు అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తా
ఈ ఏడాది భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది.
వావి వరసలు లేకుండా ప్రజలు వ్యవహారిస్తున్నారు
మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి
ఏ ఆపద వచ్చినా ప్రమాదం నుంచి కాపాడుతున్నా
ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి
ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు : భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు – పచ్చికుండపై నిల్చొని రంగం భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత – ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వెల్లడి
ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (లష్కర్) ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. వావివరసలు లేకుండా
జనాలు ప్రవర్తిస్తారని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత తెలిపారు.




