- Advertisement -
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మే 13న (సోమవారం) వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు ప్రకటిస్తున్నట్లు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -