Sunday, September 8, 2024

లక్ష్మి నర్సింహా స్వామి దీవెనలు ఎవరి పైనో …

- Advertisement -
  • may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2
    may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2

    ధర్మపురి.. త్రిముఖ పోరు ఉంటుందా?

  • సిటింగ్‌ ఎమ్మెల్యే కొప్పులను పార్లమెంట్‌కు పంపే యోచన
  • బాల్క సుమన్‌కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ అవకాశం
  • బీజేపీ నుంచి బరిలో దిగనున్న వివేక్‌?
  • కాంగ్రెస్‌ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌

ధర్మపురి: రాష్ట్రంలో నియోజకవర్గాల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రాధాన్యం సంతరించుకున్న మరో నియోజకవర్గం ధర్మపురి. ఎస్‌సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఏర్పాటైన ధర్మపురిలో.. ఇప్పటి వరకు సిటింగ్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సునాయాసంగా గెలిచారు. అయితే.. ఈసారి ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గంలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని.. త్రిముఖ పోరు సాగుతుందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. నియోజకవర్గ తాజా పరిస్థితిపై విశ్లేషణ..

may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2
may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2

నాలుగు సార్లు గెలిచిన ‘కొప్పుల’.. ఎంపీగా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ధర్మపురి నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. 2009 నుంచి 2018 ఎన్నికల వరకు నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచారు.పలు సార్లు తెలంగాణ రాష్టం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొప్పుల సౌమ్యులు గా అన్ని వర్గాలను కలుపుకొని పోతు తన దైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మినిస్టర్ ఈశ్వర్ మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కంచుకోటగా మారింది. కానీ ఈసారి మాత్రం అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

కొప్పులపై అనర్హత కేసు

సిటింగ్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ విషయంలో ప్రధాన సమస్యగా మారిన అంశం..

ద్వితీయ శ్రేణి నాయకుల విషయం లో తానే స్వయం గా ఒక సమావేశం లో ప్రభుత్వ పథకాల విషయం అయి ఎవ్వరికి డబ్బులు ఇవ్వొద్దు. మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బులు అడిగితె చెప్పుతో కొట్టండి అంటూ మాట్లాడడం, గతంలో తన స్వంత పార్టీ నాయకులే తనకు కాకుండా విపక్షా ఎమ్మెల్యే అభ్యర్థి కి పనిచేశారని ఒక సందేహం తన మదిలో మేదులుతుండగా అనర్హత కేసు. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల మెజారిటీతో గెలిచిన కొప్పులపై కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీంతో ఫలితాలు తారుమారయ్యాయని ఆయన హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీనిపై మరికొద్ది రోజుల్లో హై కోర్టు తీర్పు వెలువడనుంది. ఒకవేళ కొప్పులపై అనర్హత వేటు పడితే పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

కొప్పులకు ఎంపీ టికెట్‌

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ అధినేతకు విధేయుడిగా పేరు పొందిన కొప్పుల ఈశ్వర్‌ను ఈ సారి పార్లమెంట్‌కు పంపిచాలనే యోచనలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ నిర్ణయంగా తెలుస్తోంది. ఈ మేరకు పెద్దపల్లి ఎంపీ టికెట్‌ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి గతంలో పెద్దపల్లి ఎంపీ గా చేసి అనుభవం ధర్మపురి పై పట్టువున్న బాల్క సుమన్‌కు టికెట్‌ కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్‌ను అక్కడి నుంచి ధర్మపురి కి రప్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2
may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2

బీజేపీ నుంచి వివేక్‌?

మరో ప్రధాన పార్టీ బీజేపీ నుంచి ఈ సారి బలమైన అభ్యర్థిని బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌కు ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఉనికి ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగానే ఉంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కన్నం అంజయ్యకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. దీంతో పార్టీ ఈసారి బలమైన అభ్యర్థి కోణంలో వివేక్‌కు టికెట్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వివేక్‌ బరిలో దిగితే ఉత్కంఠ పోరుకు పరిస్థితులు దారి తీసే అవకాశం ఉంది. మరోవైపు వివేక్‌ కూడా అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చిస్తున్నారు.మరొక అభ్యర్థి పెగడపల్లి మాజీ జడ్పీటీసీ గజ్జెల స్వామిని బి ఆర్ యస్ లేదా బీజేపీ నుండి పోటీకి దింపే ఆలోచనలో ఈరెండు పార్టీ లు  ఉన్నట్లు చర్చ లేకపోలేదు.

may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2
may-the-blessings-of-lakshmi-narsimha-swami-be-upon-whom-2

అడ్లూరికే కాంగ్రెస్‌ టికెట్‌

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి అడ్లూరికే టికెట్‌ ఖరారైందని సమాచారం. గత ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన అడ్లూరికే ప్రజల్లో ఆదరణ ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఆయనపై ప్రజల్లోనూ సానుభూతి ఉందని.. ఒక్క ఛాన్స్‌ ఇద్దామనే యోచనలో ఓటర్లు ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ సొంత సర్వేల ద్వారా అంచనాకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఎమ్మెల్యే, మంత్రి హోదాల్లో కొప్పుల ఈశ్వర్‌ నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అడ్లూరి సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది.ధర్మారం కు చెందిన మద్దెల రవి కాంగ్రెస్ నుండి నాకే ఈసారి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని తన దైన శైలిలో ప్రజలతో మామ్మేకం అవుతు స్వంతగా నియోజకవర్గం లో తిరుగుతూ తాను పోటీలో ఉంటున్నట్లు ప్రచారం ముమ్మరం చేసుకుంటున్నారు.

ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం.. ప్రజల్లో వ్యతిరేకత

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జోరుగా ఉన్న బీఆర్‌ఎస్‌కు తాజాగా ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లడవుతోంది. ముఖ్యంగా స్తంబంపల్లిలో తలపెట్టిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై గత కొంత కాలంగా ధర్నాలు, రహదారి నిర్బంధం వంటి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుని బాధితులతో కలిసి పోరాటం సాగిస్తోంది. అయితే.. ఇదంతా కాంగ్రెస్‌ చేస్తున్న ఎన్నికల డ్రామా మాత్రమే అని.. ఆ పార్టీకి ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఆశావాహ అభ్యర్థి అడ్లూరి.. సిటింగ్‌ ఎమ్మెల్యే కొప్పులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అదే విధంగా బీజేపీ నేత వివేక్‌ కూడా కేసీఆర్‌ అవినీతిని ప్రధాన అస్త్రంగా చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు కొప్పుల ఈశ్వర్‌ కూడా అంతే ధాటిగా విమర్శలను తిప్పి కొడుతున్నారు. బీజేపీకి దళితులపై ప్రేమ ఉంటే దళితబంధు లాంటి స్కీమ్‌ను దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని, సింగరేణి విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

ఇలా.. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ధర్మపురి నియోజకవర్గంలో ఈ సారి పోరు ఉత్కంఠగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి అస్త్రాన్ని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను అస్త్రంగా చేసుకుంటోంది. బీజేపీ కూడా దాదాపు ఇదే రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఈ పార్టీ హిందుత్వ నినాదాన్ని ఎత్తుకోవడం కూడా గమనార్హం.

కుల సమీకరణాలు

ఇక నియోజకవర్గంలో కుల సమీకరణాలు కూడా గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. మొత్తం 2.12 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే వారిలో ఎస్‌సీ ఓట్లు 48 వేలకుపైగా ఉన్నాయి. మొత్తం ఓటర్లలో 22 శాతంగా వీరి సంఖ్య ఉంది. దీంతో.. ఎస్‌సీలతో పాటు బీజీ సామాజిక వర్గానికి చెందిన,మున్నూరు కాపు ముదిరాజ్, గౌడ, సామాజిక వర్గం ఓట్లు కూడా ప్రభావం చూపనున్నాయి.

మొత్తంగా చూస్తే.. కొప్పుల స్థానంలో మరెవరిని బరిలో దింపినా.. బీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ధర్మపురి నియోజకవర్గం ముఖ్యాంశాలు:

మొత్తం ఓటర్లు: 2.12 లక్షలు

ఎస్‌సీ ఓటర్లు 48 వేలు

విజేతలను నిర్ణయించడంలో కీలకంగా ముదిరాజ్,మున్నూరు కాపు, గౌడ వర్గాలు కూడా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్