రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి
కాంగ్రెస్ యువనేత తాటిపర్తి
రాంచంద్రారెడ్డి
జగిత్యాల,
రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మన అందరిపై ఉండి కాపాడాలని కాంగ్రెస్ యువ నాయకులు ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనయుడు తాటిపర్తి రామచంద్రారెడ్డి అన్నారు.మంగళవారం
జగిత్యాల జిల్లా
బీర్పూర్ మండలంలోని తాళ్ల ధర్మారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగలో కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రామచంద్ర రెడ్డి ,తాటిపర్తి బాలకృష్ణ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గౌడ వృత్తి
అన్నింటి కన్నా ప్రమాదకరమైనదని చెబుతూ వారి ధైర్యాన్నీ అభినందించాలని పేర్కొన్నారు.
కాంగ్రెసు నాయకులు రామచంద్రారెడ్డి ,బాలకృష్ణ రెడ్డిలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీర్పూర్ ఎంపీపీ మసర్ధి రమేష్ , వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చేర్మెన్, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.