సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మేయర్ పారిజాత నరసింహారెడ్డి

- Advertisement -

మహేశ్వరం, వాయిస్ టుడే:  బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలోని సూర్యగిరి శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి మంగళవారం విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పారిజాత నరసింహారెడ్డికి సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం దేవాలయ ఆవరణలో మేయర్ పారిజాత మాట్లాడుతూ సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారు దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mayor Parijata Narasimha Reddy visited Suryagiri Ellamma's mother
Mayor Parijata Narasimha Reddy visited Suryagiri Ellamma’s mother
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular