నేనూ, సుధీర్ రెడ్డి దోస్తులం

- Advertisement -

రాచకొండ: ఎల్బీనగర్ లో బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీలో రెండు సార్లు పోటీ చేసి కొద్దిపాటి ఓట్లతో అర్.కృష్ణయ్యపై ఓడిపోవడం జరిగింది.  గతంలో నాకు సుధీర్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలుసు. నాకు సుధీర్ రెడ్డికి ప్రస్తుతానికి ఎలాంటి విబేధాలు లేవు. మేము పోటీ చేసిందానికంటే ఎక్కువగా సుధీర్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తాం. మేము పోటీ చేద్దాం అనే ఆలోచనతోనే ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి టికెట్ కోసం వెళ్ళడం జరిగింది. అవగాహన లేని వ్యక్తులు ఇక్కడ పోటీలో ఉన్నారు…వారి మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని అన్నారు.  నాకు టికెట్ ఇస్తానని నమ్మించి కాంగ్రెస్ పార్టీ… పార్టీలో చేర్పించుకొని మోసం చేసింది. మోసగాళ్ళకు నేను మొసగాన్ని నన్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి నేను ఆ పార్టీకి మోసం చేసి బయటకు వచ్చినా. ఇక్కడ బిసి బిడ్డ పోటీలో ఉండవచ్చు నేను బీసినే నాకు అన్యాయం జరిగింది..నాకు న్యాయం జరగనప్పుడు నేను ఎట్ల పనిచేస్తానని అన్నారు. అందుకే పార్టీలో నన్ను నమ్ముకొని ఉన్న నా అనుచలకు న్యాయం చేయడం కోసం కావచ్చు…పార్టీ పెద్దల కోసం కావచ్చు పార్టీ కోసం పనిచేస్తా. సీఎం,కెటిఆర్,హరీష్ రావు నాకు ఇచ్చిన బలమైన హామీ మేరకు తిరిగి బిఆర్ఎస్ లో చేరాను. రాబోయే రోజుల్లో డీ లిమిటేషన్ అయ్యే అవకాశం ఉంది.నీకు పార్టీలో సముచిత స్థానం కల్పించి  టికెట్ ఇస్తాం అని మాకు చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సుధీర్ రెడ్డి నేను ఇద్దరం కలిసి ఎల్బీనగర్ ను బ్రహ్మండంగా అభివృద్ది చేస్తామని అన్నారు.

Me and Sudhir Reddy are friends
Me and Sudhir Reddy are friends
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular