Sunday, January 25, 2026

వాట్సాప్‌లోనే మీ-సేవా

- Advertisement -

వాట్సాప్‌లోనే మీ-సేవా

Me-service on WhatsApp itself

ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్‌ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు.

దీంతో ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండా, కేవలం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపితే సరిపోతుంది.

580కి పైగా ప్రభుత్వ సేవలు ఒకే వాట్సాప్ నంబర్‌లో

ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇది దేశంలోనే అత్యంత పెద్ద డిజిటల్ సేవల ఇంటిగ్రేషన్‌గా భావిస్తున్నారు.

✔️ ఇన్‌కం సర్టిఫికేట్
✔️ బర్త్ సర్టిఫికేట్
✔️ క్యాస్ట్ సర్టిఫికేట్
✔️ డెత్ సర్టిఫికేట్
✔️ విద్యుత్ బిల్లుల చెల్లింపు
✔️ నీటి బిల్లులు
✔️ ఆస్తి పన్నులు

ప్రజలు రోజూ ఉపయోగించే దాదాపు అన్ని సర్వీసులు ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లభ్యమవుతున్నాయి.

ప్రజలు సేవలను ఎలా పొందాలి?

సేవలను పొందడం చాలా సులభం:

WhatsApp: 80969 58096
ఈ నంబర్‌కు ‘Hi’ అని పంపాలి.
ఆటోమేటిక్ మెను వస్తుంది.
కావలసిన సేవను సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేయొచ్చు.

ఈ ప్రక్రియ పూర్తిగా సులభమైనది, వేగవంతమైనది, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకారి. ఈ కొత్త ఫీచర్‌తో సేవలలో పారదర్శకత, వేగం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. పౌరులు ఎక్కడ ఉన్నా, ఎప్పుడు కావాలన్నా ప్రభుత్వ సేవలను(MeeSeva) తక్షణం పొందగలరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్