
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కా ఫైనాన్స్ కార్పొరేషన్ సాధనకై మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో 33 జిల్లాలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ మున్నూరు కాపు డెవలప్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతపండు మహేందర్ పాల్గొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర సంఘాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల లోపు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు అని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా కుల పెద్దలు L రాజయ్య గారు రామస్వామి గారు ఈర్ల కొమరయ్య గారు ఆకుల కిరణ్ గారు మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యదర్శి బొంగరాల రాజేష్ మున్నూరు కాపు యువత జగిత్యాల జిల్లా అధ్యక్షులు మొగిలి సతీష్ , పూదరి కిషన్ చింతపండు స్వామి దాసరి రాజేశం వెంకన్న గాండ్ల రవి తోట రమేష్ మిగతా కుల పెద్దలు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది