- Advertisement -
కేసుల పరిష్కరణకు మద్యవర్తిత్వమే మేలు
Mediation is good for resolving cases
ఏలూరు
కేసుల త్వరితగతిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి( ఎఫ్.ఎ. సి) ఎం. సునీల్ కుమార్ తెలియజేశారు.సోమవారం ఏలూరు కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రిటైర్డ్ న్యాయమూర్తులకు, ఎంపిక చేసిన న్యాయవాదులకు మరియు సోషల్ వర్కర్లకు 40 గంటల (5 రోజు ల) శిక్షణా తరగతులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రధాన మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ( ఎఫ్.ఎ.సి) ఎం. సునీల్ కుమార్ ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రతిపాదించిన రిసోర్స్ పర్సన్స్ లతో న్యాయవాదులకు శిక్షణ తరగతుల నిర్వహిస్తున్నారని తెలియజేశారు. రాజీకి అవకాశమున్న కేసులలో కక్షిదారులను శాస్త్రీయంగా కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చని, నేటి సమాజంలో చిన్నచిన్న గొడవలకి న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల న్యాయస్థానాలలో కేసుల సంఖ్య విపరీతముగా పెరిగిపోయినవని, దీనిని అధిగమించడానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు మధ్యవర్తిత్వాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, కక్షి దారులకు ఏ విధముగా కౌన్సిలింగ్ నిర్వహించాలనే అంశం పైన న్యాయవాదులకు మరియు సోషల్ వర్కర్లకు తర్ఫీదు ఇచ్చే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని, కావున న్యాయవాదుల అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు.
కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి పి. మంగాకుమారి, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి. రాజేశ్వరి, ఫోక్సో స్పెషల్ కోర్ట్ జడ్జి ఎస్. ఉమా సునంద, పర్మినెంట్ లోక్ ఆదాలత్ చైర్పర్సన్ ఎ. మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్స్ పుష్ప గుప్తా, దీపక్ డింగరా మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



