ప్రతి ఒక్కరికి వైద్య సేవలు
ఎం.పీ.పీ
బేతంచర్ల
ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎం.పీ.పీ బుగ్గ నాగభూషణం రెడ్డి అన్నారు. శనివారం నాడు బేతంచర్ల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద 80 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని బేతంచర్ల మండల ఎం.పీ.పీ బుగ్గ నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల డైరెక్టర్ బాబు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం ఖరీదు కావడంతో ప్రతి ఒక్క నిరుపేదకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వారి వద్దకే వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మూర్తుజావలి, మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్ కాజా, మద్దిలేటి స్వామి ఆలయ చైర్మన్ రామచంద్రుడు, ప్లాట్ల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు



