- Advertisement -
వరద బాధితులకు వైద్య సేవలు
Medical services for flood victims
ఖమ్మం
హెటిరో సంస్థల, సింధు హాస్పిటల్స్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు సింధు హాస్పిటల్స్ బృందాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రారంభించారు.వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కి కోటి రూపాయల చెక్కును పార్థసారధి రెడ్డి అందించారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్రానికి కోటి రూపాయలు చొప్పున విరాళంగా పార్థసారధి రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా..పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ..ఖమ్మం జిల్లాలో ప్రకృతి విలయంతో పేద ప్రజలు నిరాశ్రులయ్యారన్నారు.ఈ ప్రాంత వాసిగా నా వంతుగా సహాయం అందించడం నా బాధ్యతగా భావించనన్నారు.మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతు..ఖమ్మం జిల్లా వాసులకు, మన జిల్లాకు ఏ విపత్తు, ఏ ఆపద సంభవించిన నేను ఉన్నానంటూ పార్థసారధి రెడ్డి ఆపన్న హస్తం అందిస్తున్నారాన్నారు. గతంలో కూడా ఖమ్మం జిల్లాకు వరదలు సంభవించినప్పుడు అప్పటి కలెక్టర్ కి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలలో వరదలు సంభవించినప్పుడు అక్కడ కలెక్టర్ కి కూడా రూ. కోటి రూపాయలు విరాళం అందజేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం కూడా గత కొద్ది రోజులలో ఖమ్మం మరియు పాలేరు ప్రాంతాలను అతలాకుతలం చేసిన తుఫాను ప్రాంతవాసుల సహాయార్థం ఈరోజు ఒక కోటి రూపాయలు విరాళం కలెక్టర్ సంతోషంగా ఉందన్నారు.
అలాగే వారు, వారి కుమార్తె జ్ఞాపకార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికంగా హైదరాబాదులో నిర్మించిన సింధు హాస్పిటల్ వైద్య బృందాలను, మందులను కలెక్టర్ కి అందుబాటులో ఉంచి వరద ప్రాంతాల్లో వచ్చే వ్యాధులను అరికట్టే విధంగా కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి కోటి రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -