రిమ్స్ ముందు మెడికోల ధర్నా
అదిలాబాద్
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణకు కారకులైన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా కలె exక్టరేట్ ముందు మెడికల్ విద్యార్థులు నిరసన చేపట్టారు. కళాశాల ఆవరణలో ఇంత పెద్ద ఘర్షణ చోటు చేసుకున్న రిమ్స్ డైరెక్టర్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు.
రిమ్స్ ఆస్పత్రిలోని వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నయని, సరైన వసతులు లేవని తాము రిమ్స్ డైరెక్టర్ ను ప్రశ్నించినందుకు తనపై తిరగబడతారా అని ప్రశ్నించారు. అది దృష్టిలో ఉంచుకుని వారి రిలేటివ్ అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి తో కలిసి బయటి వ్యక్తులను తీసుకువచ్చి తమపై రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ అమ్మానుషంగా దాడి చేయించారని ఆరోపించారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధులనుండి తొలగించాలని, రిమ్స్ డైరెక్టర్ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేశారు.
రిమ్స్ ముందు మెడికోల ధర్నా
- Advertisement -
- Advertisement -