బీఆర్ఎస్ అసంతృప్త నేతల భేటీ

- Advertisement -

భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. భువనగిరి శివారులో అసంతృప్త నేతల కీలక సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. వలిగొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కోనపూరి కవిత  ఆధ్వర్యంలో ఈ  సమావేశం జరిగింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వైఖరిపై కొంతకాలంగా కోనపూరి కవిత అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల తర్వాత భారీ జన సమీకరణతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. మాజీ మావోయిస్టు నేత, బీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కోనపురి సాంబశివుడు మరదలు, బీఆర్ఎస్ నేత కోనపూరి రాములు  సతీమణి కవిత.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular