- Advertisement -
సీఎం రేవంత్ లో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారుల భేటీ
Meeting of water board and irrigation officials with CM Revanth
హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి తో జూబ్లీహిల్స్ నివాసంలో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీ ల గోదావరి జలాల తరలింపు పైన సమీక్ష జరిపారు. కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ప్రాజెక్టు ల నుంచి నీటి తరలింపు పైన సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యత పైన పూర్తి అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే నెల 1 తేదీ వరకు టెండర్లకు వెళ్లేలా కార్యచరణ రూపొందించాలి. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.
ఈ సమీక్ష లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె. పాటిల్, ఇతర అధికారులు పాల్గోన్నారు.
- Advertisement -