Sunday, September 8, 2024

కవితతో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతినిధుల భేటి

- Advertisement -
  • నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి
  • గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత
  • నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ
  • సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు
  • మంగళవారం ఐటీ హబ్ ను సందర్శించనున్న  కంపెనీ ప్రతినిధులు
  • కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం… హైదరాబాద్ కార్యాలయంలో  దాదాపు 3 వేల మంది ఉద్యోగులు
Meeting with representatives of Global Logic Company with Kavitha
Meeting with representatives of Global Logic Company with Kavitha

హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గొవర్ధన్, షకీల్ కూడా పాల్గొన్నారు.

Meeting with representatives of Global Logic Company with Kavitha
Meeting with representatives of Global Logic Company with Kavitha

కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.  నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణ లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ను సందర్శించనున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ఐటీ హబ్ లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఐటీ హబ్ లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో నిజామాబాద్ లో మరిన్ని కంపెనీలు ఏర్పాటు అవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కవిత కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ గ్లోబల్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల గుప్తా కూడా పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్