1.4 C
New York
Monday, February 26, 2024

మెగా బంధం.. ఎమోషనల్

- Advertisement -

విజయవాడ, నవంబర్ 4, (వాయిస్ టుడే ): మెగా బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి వివాహం ఇట‌లీలోని టుస్కానీలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో మెగా బ్రదర్స్…సిస్టర్స్ కలిసి ఉణ్న ఫొటోలను ఫ్యాన్స్ కు ఇష్టపడుతున్నారు. ఇక, ఇప్పుడు మెగా బ్రదర్స్ ముగ్గురు కలిసి ఉన్న ఫొటో తో పాటుగా నాగబాబు చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.తాజాగా నాగ‌బాబు త‌న ఇద్దరు బ్ర‌ద‌ర్స్‌తో క‌లిసి దిగిన ఫొటోని ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్ లో నాగ‌బాబుతో పాటు చిరు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తమ బంధం గురించి నాగబాబు వివరించారు. .”మా మధ్య ఎన్ని విభేదాలు.. వాదనలు వచ్చిన మా బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.మేము చేసే పనులు, మా జ్ఞాపకాలు, మా మధ్య విభేదాలు అన్నిటికంటే కూడా మా అనుబంధమే ఎంతో ముఖ్యమైనది.”అని పోస్ట్ చేశారు. అంతేకాదు వాళ్ళ బంధం ఎన్నో పనులు, ప్రేమతో గడిపిన క్షణాల పై ఆధారపడి ఉంటుందట. అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ బంధం నిజంగా ఎంతో విలువైనదిగా తాను భావిస్తున్నట్లు చెప్పారు నాగబాబు.

Mega bond.. emotional
Mega bond.. emotional

అలాగే తమ అనుబంధం ఎప్పటికీ విడిపోదని.. తమ బంధం పై తమకు అంత నమ్మకం ఉందని నాగబాబు పేర్కొన్నారు.ఇలా మెగా బ్రదర్స్ మధ్య ఉన్న ఆప్యాయత – అనుబంధం గురించి నాగబాబు చేసిన పోస్టింగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పెళ్లి సమయంలో మెగా కుటుంబం మొత్తం ఒకే వేదిక మీదకు రావటం.. కలిసి ఫొటోలు దిగటం ఈ వెడ్డింగ్ లో ప్రత్యేకంగా నిలిచింది. ఇక రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో కూడా వైర‌ల్‌గా మారాయి. పవన్ సతీమణి అచ్చం తెలుగింటి మహిళగా ఈ వివాహంలో కనిపించారు. తమ్ముడు నాగబాబు కొడుకు పెళ్ళికి చిరు కుటుంబ పెద్దగా వ్యవహరించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ పిల్లాపాపలతో సందడి చేశారు. వైష్ణవ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా ప్రతి ఒక్కరూ వరుణ్ పెళ్ళికి హాజరై హంగామా చేశారు. నిహారిక పెళ్లి రోజు వేదిక వ‌ద్ద డ్యాన్స్ చేసి హ‌డావిడి చేసింది.

Mega bond.. emotional
Mega bond.. emotional

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!