డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ డీవోపీ పని చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ కార్తీక్, ఆయన టీమ్‌ను అభినందించారు.విజయ్ కార్తీక్ డీవోపీ గా పని చేసిన జైలర్ 2 ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జైలర్ 2 కోసం వారు చేసిన అద్భుతమైన వర్క్ ను ప్రశంసించారు మెగాస్టార్.
ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అనస్వర రాజన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్, అనురాగ్ కశ్యప్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular