- Advertisement -
మేయర్ ను అడ్డుకున్న గణేష్ ఉత్సవ సమితి సభ్యులు
Members of the Ganesh Utsava Samiti who blocked the mayor
హైదరాబాద్
ఉప్పల్ నల్లచెరువు పరిశీలించడానికి వచ్చిన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కి చేదు అనుభవంఎదురయింది. ఉప్పల్లో ఏం పనులు జరగట్లేదని భాగ్య నగర ఉత్సవ సమితి సభ్యులు ప్రశ్నించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తమపై దాడి చేశారని ఆరోపిస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకుదిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసారు.
- Advertisement -



