క్యాన్సర్‌పై పోరాటంలో మనోదైర్యం కీలకం: డాక్టర్ రామకృష్ణ ప్రసాద్

- Advertisement -

క్యాన్సర్‌పై పోరాటంలో మనోదైర్యం కీలకం: డాక్టర్ రామకృష్ణ ప్రసాద్

క్యాన్సర్‌పై మనోదైర్యమే గొప్ప ఆయుధం

యశోద ఆసుపత్రిలో అత్యాధునిక హైపర్‌సైట్ టెక్నాలజీతో చికిత్సలు

ప్రారంభ దశలో గుర్తిస్తే సంపూర్ణ నివారణ సాధ్యం

Mental strength is crucial in the fight against cancer: Dr. Ramakrishna Prasad

కరీంనగర్, జూన్ 12: వాయిస్ టుడే క్యాన్సర్‌ను జయించడంలో వైద్య చికిత్సతో పాటు రోగిలో ఉండే మనోదైర్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ప్రముఖ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం యశోద ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా యశోద ఆసుపత్రి రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అత్యాధునిక *హైపర్‌సైట్ సాంకేతికత*ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సాంకేతికత భారతదేశంలో మరెక్కడా అందుబాటులో లేదని, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో మాత్రమే ఈ ఆధునిక చికిత్సా విధానం అందిస్తున్నామని పేర్కొన్నారు.

హైపర్‌సైట్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఉన్న ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి, కేవలం ఆ భాగానికే రేడియేషన్‌ను అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో శరీరంలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలపై ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో పాటు చికిత్స దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గుతాయని వివరించారు.

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించేందుకు యశోద ఆసుపత్రి తరఫున ప్రత్యేక వైద్య సదస్సులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అత్యాధునిక హైపర్‌సైట్ సాంకేతికత ద్వారా ఇప్పటికే అనేక మంది క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్స అందించి, వారిని కోలుకునేలా చేసినట్లు ఆయన వెల్లడించారు. కరీంనగర్ జిల్లా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆధునిక వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి ప్రతినిధులు శ్రీకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular