Monday, February 23, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో

- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో
యువత కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు
సీఎం రేవంత్ రెడ్డి
హైదారాబాద్
మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదని ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఎయిర్పోర్టు కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే  దూరం తగ్గిస్తాం.బీహెచ్ఈఎల్  నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది.
ఎం జి బి ఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుంది.  నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ  హాస్పిటల్  మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్పోర్టు కి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని అన్నారు.
మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తాం. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరు. మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుంది. ఫార్మాసిటీ ని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాము. జీరో కాలుష్యం తో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుంది. అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయని అన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని అన్నారు.
యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ….ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుంది.
సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి, స్కిల్స్ అదనంగా ఉంటాయి. అక్కడ నుంచి బైటకి వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుంది. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా  బాధ్యతలు అప్పగించాం. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుంది. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తాం. ఆయాదేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం. ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు  మెరుగు పరుస్తాం. మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది…వారికీ ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే
అవకాశం ఉందని అన్నారు.
3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తాం. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం. నాకు దగ్గరనో భందువులనో పదవులు ఇచ్చేది ఉండదు. నేను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తామని అన్నారు.
పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం . హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించా ….వారికీ అవసరమైన
మాన్ పవర్ ను వాళ్ళే పిక్ చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తా. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేట్లు చూసుకోవాలని అన్నారు.
అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తాం. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నా. నా వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. జర్నలిస్టులకు సంబంధించి  సమస్యను పూర్తి స్థాయి లో పరిష్కరిస్తాం. ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్