Monday, January 13, 2025

పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్నం భోజనం..ఎమ్మెల్యే గిత్త

- Advertisement -

పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్నం భోజనం..ఎమ్మెల్యే గిత్త

Midday meal to provide nutritious food.. MLA Gitta

 పోషకాహారంతో పేద విద్యార్థులకు మేలు

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

నందికొట్కూర్
: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. శనివారం మండల కేంద్రమైన మిడుతూరు లోని స్థానిక జూనియర్ కళాశాల ఆవరణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణ గావించిన తల్లి డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం పేద విద్యార్థులకు ఒక వరం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకం అమలు కానుందని475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో398 కళాశాలలకు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉండడంతో పాఠశాలల్లోనే భోజనం తయారు తయారుచేయునట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 432 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం1422 కోట్లు రాష్ట్ర విద్యార్థులకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేరాలంటే దాదాపు రెండు లక్షల ఖర్చు అవుతుందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాగ్ ,నోట్ బుక్స్ తో 16 వేల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో ఉన్న ఈ పథకాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి నీరుగార్చిందని ఆయన ఆరోపించారు. విద్యార్థిని ,విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సంపాదించి గ్రామానికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహించిందన్నారు. రుచికరమైన భోజనం అందించడంతోపాటు కళాశాలలో హాజరు శాతం పెరిగి ఉత్తీర్ణత సాధిస్తారన్నారు. అనంతరం మిడుతూరు జూనియర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ బి.శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కళాశాలలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. పదివేలు పెట్టి గ్లాసు,ప్లేట్ ఇవ్వడం జరిగింది అన్నారు. కళాశాలకు దివంగత కేడీసీసీ చైర్మన్ కాతా అంకిరెడ్డి సహాయ సహకారాలు మరువలేనివి అన్నారు. కళాశాల ప్రారంభించి 24 ఏళ్లు పూర్తవుతుందని కళాశాలకు నాలుగు బిల్డింగులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సిల్వర్ జూబ్లీ జరిపే లోపు నాలుగు బిల్డింగులు శాంక్షన్ చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నందికొట్కూరు నియోజవర్గానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా ఆయన స్పందించారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆదర్శ మహిళ అయిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం శుభసూచికమని కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు .కళాశాల ప్రిన్సిపల్ తో పాటు వారి సిబ్బంది ఎమ్మెల్యేకు మరియు రాజకీయ నాయకులకు పూలమాలవేసి దుశ్యాలువతో సన్మానించారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించడంతోపాటు విద్యార్థిని ,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయలక్ష్మమ్మ ,ఎంపీడీవో దశరథ రామయ్య, ఎంఈఓ పైజున్నిసా బేగం, మిడుతూర్, పగిడ్యాల టిడిపి మండల కన్వీనర్లు కాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, నందికొట్కూరు మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, గుండం సర్వోత్తమ్ రెడ్డి, వంగాల శివరామిరెడ్డి, రోళ్ళపాడు మాజీ సర్పంచ్ నాగ స్వామి రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం .ప్రభాకర్, కళాశాల సిబ్బంది సీతారామరాజు, ఎల్లన్న ,రామచంద్ర ,కోటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్