- Advertisement -
హైదరాబాద్‌లో మిలద్ ఉత్సవాలు వాయిదా
Milad celebrations in Hyderabad postponed
Aug 30, 2024,
హైదరాబాద్‌లో మిలద్ ఉత్సవాలు వాయిదా
హైదరాబాద్‌లో మిలద్-వున్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. 19వ తేదీన ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అంగీకరించింది. సెప్టెంబరు 7 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమౌతాయి. 17వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతారు. 16వ తేదీ నాడే మిలాద్-వున్- నబి పండగ రావడంతో మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -