అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
-రెండు లక్షల ఎల్ఓసి మంజూరు చేయించిన మంత్రి
మంథని
ఎంతోమంది అనారోగ్య బాధితులకు రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలుస్తున్నారు. మంథని నియోజకవర్గంలో పాటు, ఇతర నియోజకవర్గాలకు చెందిన
నిరుపేద అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆయన భరోసా కల్పిస్తున్నారు.
మంథని మండలo వెంకటాపూర్ గ్రామానికి చెందిన తాల్లపల్లి శంకరమ్మ బ్రెయిన్ కి సంబంధించిన అనారోగ్యంతో
బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతు సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను సంప్రదించగా వెంటనే ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల
రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. మంగళవారంమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను వారికి అందజేశారు. రెండు లక్షల
రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కు శంకరమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.



