రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
—కాబోయేది సీఎం కేసీఆరే
—అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి
—ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల
కరీంనగర్, నవంబర్ 09 (వాయిస్ టుడే): తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది, బంగారు తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్ర పార్టీలు కుమ్మక్కై తెలంగాణను దోచుకోవడానికి చూస్తున్నాయని బిఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 28,29,46 డివిజన్ అశోక్ నగర్ శివాలయం,టవర్ సర్కిల్ లో ప్రచారం నిర్వహించారు. డివిజన్ ప్రచారం లోభాగంగా ప్రజలు మంగళహారతులతో పూలుచల్లుతూమంత్రి గంగులను స్వాగతించారు. ప్రచారానికి విచ్చేసిన అందరినీ మంత్రి ఆప్యాయంగా పలుకరించారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే తాగునీళ్లు, కరెంటు కష్టాలు తొలగినయని వివరించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు జరిగాయని, కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు.సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, అభివృద్దిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని అన్నారు .. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని
కాబోయేది సీఎం కేసీఆర్ అని వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి పరుగులుపెడుతుందని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టో అమలు చేస్తామని అన్నారు.. అర్హులైన నిరపేద ప్రజలకు రూ.400కే సిలిండర్ అందజేస్తామని వెల్లడించారు.. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు గ్యారెంటీ ఎవరు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బారాసా నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ నాంపల్లి శ్రీనివాస్, వంగల శ్రీదేవి -పవన్ కుమార్, నాయకులు జెల్లోజు శ్రీనివాస్, గోగుల గణేష్ సముద్రాల మధు, మిర్యాల్ కర్ నరేందర్, శ్రీ రాముల శ్రీకాంత్ పలువురు నాయకులు పాల్గొన్నారు.