Friday, December 27, 2024

బొమ్మకల్ ఎన్నికల ప్రచారంలో  మంత్రి గంగుల కమలాకర్

- Advertisement -

కరీంనగర్: రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం

 

పలికారు. మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా

 

నిలిచిన వ్యక్తికి 20 కోట్ల రూపాయలకు టికెట్ బండి సంజయ్ అమ్ముకున్నడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఎదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకావాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్

 

బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేసారు.  భు మాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయన సర్పంచ్ గా అవకాశం ఇస్తే కబ్జాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ

 

భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు భూమాఫియా లో భాగస్వాములు అని అన్నారు. తనకు వ్యాపారాల వల్ల డబ్బులు సంపాదిస్తే బీజేపీ అభ్యర్థి బండి

 

సంజయ్ ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబ్జాల వల్ల బొమ్మకల్ గ్రామంలోని భూ రికార్డులు సీబీసీఐడీ వద్ద ఉండే దుస్థితి దాపురించింది అని

 

అన్నారు. 12 ఇళ్లులు కట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గ్రామపంచాయతీ భవనం కట్టలేకపోయడని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ ను గెలిపిస్తే ఒక్క రోజు ఏ గ్రామానికి రాని వ్యక్తి మళ్ళీ ఓట్ల కోసం ఏ ముఖం

 

పెట్టుకొని వస్తున్నాడని, మహిళలు నిలదీయాలని కోరారు. రానున్న ఎన్నికలు మీ బిడ్డల భవిష్యత్ ను సూచించే ఎన్నికలు అని, ఒక్క ఓటు తప్పు జరిగితే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని

 

అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్