సెస్ విద్యార్దుల హస్టల్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ – సెస్ లో విద్యార్థునుల వసతి గృహాన్ని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రూ. 5 కోట్లతో హాస్టల్ అద్భుతంగా నిర్మించారు. కార్పొరేట్ స్థాయిలో ఉంది. ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మించారు. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్ధాపన చేసుకొని, ఏడాదిలో పూర్తి చేసుకున్నాం. జాతీయ స్థాయిలో సేస్ కు మంచి పేరు ఉంది. హాస్టల్ లో 19 గదులు ఉన్నాయి. 40 మంది వరకు ఉండవచ్చు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నది. జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు డిమాండ్ ఉంది. వివిధ రాష్ట్రాల నుండి చేరుతున్నారు. వీరి అవసరాల నిమిత్తం రు. 5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుంది. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుంది. ప్రభుత్వ విధానాలు, పథకాలు రూపకల్పనలో, అమలు చేయడంలో సామాజిక అధ్యయనాలు ఎంతో అవసరం. సీఎం కేసీఆర్ ఒక పథకం అమలు చేసే ముందు ప్రజా కోణంలో ఆలోచిస్తారు. అందుకే అవి విజయవంతం అవుతున్నాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి బాల్య వివాహాలను తగ్గించింది. పార్లమెంట్ చట్టాలు చేయలేనిది పథకం చేసిందని అన్నారు.

కేసీఅర్ కిట్ వల్ల వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయి. కిట్ వల్ల ట్రాకింగ్ సిస్టం లోకి తెచ్చాం. నాడు 30 శాతం ఉంటే, నేడు ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 76శాతం జరుగుతున్నాయి. మిషన్ భగీరథ వల్ల సురక్షిత తాగునీరు అందుతున్నది. తద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. నాడు ప్రజలు ఎంతో ఇబ్బంది పెడేవారు. తాగు నీటి సమస్య నేడు ప్రజలకు లేకుండా పోయింది. హైదరాబాద్ లో నీటి కోసం ఎంతో ఇబ్బంది. ఇప్పుడు అలాంటివి లేవు. సీఎం కేసీఆర్ ఆలోచన వల్ల గుణాత్మక మార్పు సాధ్యం అయ్యింది. ప్రభుత్వ పాలసీలు సామాజిక పరిస్థితుల ఆధారంగా కల్పన చేయాల్సి ఉంటుంది. అప్పుడే అవి అనుకున్న ఫలితాలు ఇస్తాయి. సెసు, అధ్యయనాలు ప్రభుత్వాలకు వెన్నెముక గా పని చేస్తుంది. మా పూర్తి సహకారం ఉంటుంది. సెస్సు సేవలను మరింత వినియోగించుకుంటామని అన్నారు.



