చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
“సమృద్ధిగా వర్షాలు పడి.. కరువు అంతమై.. పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని” శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నట్టు తెలిపారు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవ్వాల ఉదయం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కీసర మండలం, చీర్యాలలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని వాటిలో సౌకర్యాలు కల్పిస్తే భక్తులు మరింత సౌకర్యంగా భగవంతున్ని దర్శించుకుంటారని.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఆలయాల్లో భక్తులకు మౌళికవసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఆలయ ఛైర్మన్ మల్లారపు లక్ష్మీనారయణ గారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లు బ్రహ్మండంగా చేశారని ఆయన కితాబునిచ్చారు.
లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తో పాటు తదితర భక్తులు పాల్గొన్నారు