- Advertisement -
మల్లన్నను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha visited Mallanna
శ్రీశైలం
శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయ రాజగోపురం వద్ద మంత్రి కొండా సురేఖకు ఈవో శ్రీనివాసరావు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. అమ్మవారి ఆశీర్వచనం మండపంలో మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం పలికారు అర్చకులు, వేదపండితులు.స్వామి అమ్మవార్లు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైల స్వామి అమ్మవార్లను ప్రతి ఏటా దర్శించుకుంటానని, తమ కూతురికి కొడుకు పుట్టిన సందర్భంలో శ్రీశైలం వచ్చినట్లు కొండా సురేఖ తెలిపారు.
- Advertisement -