ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

- Advertisement -

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణి కి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని , వారి అర్జీలను తీసుకున్నారు. ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త సందేశo పంపుతున్నట్లు తెలిపారు.

ప్రజావాణి నిర్వహణను జలమండలి ఎండి దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ముషారఫ్ అలీ, ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Minister Konda Surekha who received the pleas in public
Minister Konda Surekha who received the pleas in public

తదుపరి ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం

తదుపరి ప్రజావాణి కార్యక్రమం వచ్చే శుక్రవారం మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో నిర్వహించబడుతుందని ప్రజా భవన్ అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటల లోపు ప్రజా భవన్ కు చేరుకున్న వారి ఫిర్యాదులు మాత్రమే స్వీకరించబడుతాయని వారు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular