కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండ సురేఖ కౌంటర్
హైదరాబాద్
మాజీ మంత్రి కేటీఆర్ కు అటవీ & పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ కౌంటర్ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లలో అమలు చేయలేని కనీస అవసరాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే.. జీర్ణించుకోలేని కేటీఆర్ ఇవాళ చిల్లర మాటలు.. చిల్లర విమర్శలు చేస్తున్నారు.. మా ప్రభుత్వం ఏర్పడి నేల కూడా కాలేదు.. కనీసం 100 రోజులు కూడా సమయం ఇవ్వకుండా అప్పుడే 100 రోజుల్లో ప్రభుత్వం పడిపోతది.. అంటే మళ్ళీ ఎలక్షన్ లు వస్తయా??? ప్రజలను ఎందుకు తప్పుతోవ పట్టిస్తున్నారు! నాకు అర్దం అయితలేదు. కేటీఆర్ ఏమి మాట్లాడుతున్నాడో… కొంచం ఐన ఆలోచించి మాట్లాడితే బాగుంటది అని మంత్రి సురేఖ అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ప్రజల సొమ్ముని పందికొక్కుల్ల మేసి అడ్డంగా బలిసి.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు ను కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని.. , ఉద్యమకారులను అన్యాయంగా బయటకు పంపింది ఎవరని అన్నారు.
మహిళలపై దాడులు జరిగినప్పుడు గానీ, కొండ గట్టు మీద జరిగిన ఘోర ప్రమాదం లో 63 మంది చనిపోతే స్పందించని లీడర్లు ఇప్పుడు ప్రజల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం.. సిగ్గుచేటు అని సురేఖ అన్నారు..
వరంగల్ లో సెంట్రల్ జైల్ ను కూల్చి.. హాస్పిటల్ కట్టడం ఎందుకు? హాస్పిటల్ మంచి వాతావరణం లో కడితే బాగుంటది అని చెప్తే.. దానిని తప్పుగా ప్రచారం చేస్తున్న వారికి కొంచం ఐన ఇంకిత జ్ఞానం వుండాలి.. హాస్పిటల్ ఎప్పుడు మంచి వాతావరణం లో ప్రశాంతంగా వుండాలి.. అప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారు.. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.. తెలంlగాణకు దళితుడిని తొలి ముఖ్య మంత్రి చేస్తామని చేసిందెవరు..? రైతుల రుణమాఫీ ఇస్తామని ఎగ్గొట్టింది ఎవరు..? తొమ్మిదిన్నరేం డ్ల పాలనలో తెలంగాణ లో విధ్వంసం జరిగింది. బీఆర్ఎస్ అహంకారం తో పరిపాలన అస్తవ్యస్తమైందని అన్నారు.
అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇచ్చిన అభయహస్తం గ్యా రం టీ హామీల ప్రకారం ఆర్టీసీలో ఉచితం గా మహిళలకు బస్సు ప్రయాణం అమలు చేసిం ది కాం గ్రెస్ ప్రభుత్వం.. మీ కుటుంబం లోని మహిళలనో, మీ పార్టీ మహిళా లీడర్లనో ఒక్క సారి ఆర్టీసీ బస్సు లో ఒక్కసారి ప్రయాణం చేయమని చెప్పండి.. మేం ఇచ్చిన హామీ అమలవుతుందో లేదో తెలుస్తుంది.
ప్రజలను లైన్లలో నిలబెట్టి.. ప్రతి రోజు ప్రజలను గోస పెడుతున్నమని కేటీఆర్ మాట్లాడటం అహం కారానికి నిదర్శనం.. గడీ,ఫామ్ హౌజ్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్కు ఇప్పు డు ప్రజల బాధలు కనిపిస్తున్నాయా..?
ఆందోళనలు,ధర్నాలన్నింటిపై నిర్బంధం , ధర్నా చౌక్ను ఎత్తేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ కు దక్కుతుంది. ప్రగతిభవన్ ఇనుప బారికేడ్లు తొలగించి.. ప్రజలు తమ సమస్య లు చెప్పుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజా వాణిని విమర్శిం చటం.. వాళ్లకున్న అహంకారాన్ని చాటిచెపుతోందని అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండ సురేఖ కౌంటర్
- Advertisement -
- Advertisement -



