Wednesday, May 20, 2026

పుట్టపర్తిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

- Advertisement -

పుట్టపర్తిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

Minister Nara Lokesh Babu's birthday celebrations were grand in Puttaparthi

ఫోన్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి :23

పుట్టపర్తి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ ,ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తెలుగు తమ్ముళ్లు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం , అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు ,పండ్లు  పంపిణీ చేశారు. ఆమడ గూరు,పుట్టపర్తి తో పాటు అనంతపురం లో పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పలు వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు పండ్లు , బ్రెడ్లు పంపిణీ చేశారు. యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి లు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతపురం నగరంలోని పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల లో గురువారం  టీడీపీ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కట్ చేసి అందరికి పంచి పెట్టి మంత్రి లోకేష్ బాబు కు బర్త్ డే విషెష్ చెప్పారు.
అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడి చెరువు ,పుట్టపర్తి మున్సిపాలిటీ, పుట్టపర్తి రూరల్ ,బుక్క పట్నం,కొత్త చెరువు, ఆమడగూరు  మండలాల్లో మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. టిడిపి కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్