ప్రజాదర్బార్ వినతికి స్పందించిన మంత్రి నారా లోకేష్
Minister Nara Lokesh responded to the plea of Prajadarbar
కణితితో అల్లాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా శస్త్ర చికిత్స
అమరావతిః
ముక్కు మీద కణితితో అల్లాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా చికిత్స అందించి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ చిన్నారికి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చిన్నారి అబ్దుల్ గత కొంతకాలంగా ముక్కుమీద కణితితో అల్లాడుతున్నాడు. ఉండవల్లి ప్రజాదర్బార్ ద్వారా మంత్రి లోకేష్ ను కలిసిన చిన్నారి తల్లిదండ్రులు నూర్ అహ్మద్, పఠాన్ అల్లాబి.. తమ కుమారుడి ముక్కు మీద ఉన్న కణితి తొలగించేందుకు ఆపరేషన్ అవసరమని, వైద్య సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన మంత్రి.. చిన్నారి సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించారు. మంత్రి నారా లోకేష్ సాయంతో తమ కుమారుడు కోలుకున్నాడని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


