- Advertisement -
పించణ్ల పంపిణీలో పాల్గోన్న మంత్రి నారాయణ
Minister Narayana participated in the distribution of pinchans
నెల్లూరు
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని, వారు కట్టే పన్నుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆరో డివిజన్ పరిధిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళ్లపాక అనురాధ, విజేత పాల్గొన్నారు.
అడ్డదారుల్లో అనుమతులు తెచ్చుకుంటే నుడా ఎందుకు.. టౌన్ ప్లానింగ్ ఎందుకు.. ఎత్తేద్దాం.. కనీసం జీతాలైనా మిగులుతాయి అంటూ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేశారని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం రూల్స్ పాటించాల్సిందే.. ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టాల్సిందే.. అంటూ క్లారిటీగా చెప్పేశారు.తనకు కోటంరెడ్డికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. కార్పొరేషన్ అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి చెప్పిన విషయాలలో తప్పులేదని తెలిపారు. శ్రీధర్ రెడ్డితో మాట్లాడుతూనే ఉన్నానని.. విబేధాలు కేవలం మీడియా సృష్టేనని స్పష్టం చేశారు.
- Advertisement -