Saturday, February 7, 2026

హుస్నాబాద్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నంఎన్నికల ప్రచారం

- Advertisement -

హుస్నాబాద్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నంఎన్నికల ప్రచారం
హుస్నాబాద్

Minister Ponnam campaigning in support of Congress party candidates in Husnabad Municipality
హుస్నాబాద్ మొదటి వార్డులో ని కేవీ కాలని లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ కి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం  డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉన్నికల ప్రచారంలో గడపగడప కి వెళ్తూ మహిళలు, చిన్నారులను , వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం లో చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.
హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని.. హుస్నాబాద్ మున్సిపాలిటీ లో సీసీ రోడ్లు , డ్రైనేజీ నిర్మాణాలు , తాగునీటి, వ్యవస్థ ,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి,కొత్త చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు, అర్బన్ ఫారెస్ట్ పార్క్ తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వానికి అండగా ఉండాలని హుస్నాబాద్ లో ఉన్న 20 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తనకి మరింత మద్దతు ఉంటుందని  అన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు ,సన్న బియ్యం,రేషన్ కార్డులు పంపిణీ,ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, సన్న వడ్లు కి 500 బోనస్ , రైతు భరోసా, రైతు రుణమాఫీ,మహిళలకు వడ్డీలేని రుణాలు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం తో ప్రత్యేక పథకాల అమలు ,మహిళలకు ఇందిరమ్మ చీరలు ,ఉద్యోగాల భర్తీ తదితర పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్