- Advertisement -
కలెక్టరేట్ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్
Minister Ponnam inspected the Public Governance Service Center
హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రజా పాలన సేవా కేంద్రాన్ని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరిశీలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రజాసేవ కేంద్రం ప్రారంభంఅయింది. ప్రజా సేవ కేంద్రం ప్రయోజనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు హైదారాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివరించారు. ప్రజాసేవ కేంద్రంలో ప్రస్తుతం అమలవుతున్న గ్యారంటీ స్కీమ్స్ లో మహాలక్ష్మి పథకం ద్వారా అమలవుతున్న 500 కి గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు వీటికి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ సవరణలు ప్రజా సేవ కేంద్రంలో చేయనున్నట్లు వెల్లడించారు. .
- Advertisement -