బసవేశ్వర విగ్రహానికి మంత్రి పొన్నం నివాళులు

- Advertisement -

బసవేశ్వర విగ్రహానికి మంత్రి పొన్నం నివాళులు
హైదరాబాద్

మహాత్మా శ్రీ బసవేశ్వర 892 వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద శ్రీ బసవేశ్వర విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్,పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ నివాళులు అర్పించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో సమాజం మీద అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు. బసవేశ్వరుడు జగత్ గురువుగా వారి జయంతి వేడుకల్లో ట్యాంక్ బండ్ పై వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని.. అందరూ పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే  ఎక్కడ ఉద్రిక్త వాతావరణలు ఉండవని అన్నారు.
బసవేశ్వరుడి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular