- Advertisement -
ఆర్టీసీలో నియామక పత్రాలను అందచేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్
సచివాలయం లోని తన ఛాంబర్ లో టీఎస్పిఎస్సీ ద్వారా ఆర్టీసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేసారు. అర్హత సాధించిన మొత్తం 72 మందిలో మొదటి విడత గా 12 మంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల్లో 7 మంది ఆర్టీసి ఫైనాన్స్ విభాగంలో , ఐదుగురు పర్సనల్ విభాగంలో నియమకమయ్యారు.. ఆర్టీసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి సత్కరించి మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈడిఏ కృష్ణకాంత్ , ఈడివో మునిషేకర్ , ఈడిలు పురుషోత్తం నాయక్ , వెంకటేశ్వర్లు , సీపీఎం ఉషా దేవి ,డిప్యూటీ సిపిఎం శిరీష లు పాల్గోన్నారు.
- Advertisement -