ఉజ్జయని మహాకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష
సికింద్రాబాద్
ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని నగర ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హజరయ్యారు. జులై 21..22 వ తేదిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు, రంగం జరగనున్నాయి. వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు మంత్రి ఆదేశించారు. కేవలం ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి మినహా కార్లకు లోనికి అనుమతి లేదు. జేమ్స్ స్ట్రీట్ ప్రధాన రోడ్డు వద్దనే వీఐపి ల కార్లు నిలిపి అక్కడి నుండి నడుచుకుంటూ దర్శనానికి రావాలి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మహంకాళి..డిప్యూటీ మేయర్ మోతె శ్రీ లత…నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్..ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ..కార్పొరేటర్స్… చీర సూచిత్ర…కొంతం దీపిక పాల్గొన్నారు…
ఉజ్జయని మహాకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష
- Advertisement -
- Advertisement -