బస్వాపూర్ లో మంత్రి పొన్నం పర్యటన
సిద్దిపేట
Minister Ponnam's visit to Baswapur
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఫినేటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ & సైన్స్ ల్యాబ్ & రోబోటిక్ ల్యాబ్ లను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డిపీవో దేవకి,ఆర్డీవో రామ్మూర్తి, , ఎంఈవో పద్మయ్య , ఇన్ఫినెటివ్ విద్యా ఫౌండేషన్ కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
స్కూల్ లో డ్రింకింగ్ వాటర్ & అదనంగా రెండు తరగతి గదులు & స్పోర్ట్స్ మెటీరియల్ అవసరముందని మంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేలా గ్రామాల్లో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీరు కష్టపడి చదువుకుంటే మీకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకోవాలి. గ్రామ పెద్దలు ,టీచర్లు అందరూ ఉన్నారు బయటి ప్రైవేట్ బస్సులు బంద్ అయితే విద్యార్థులు అంత ఇక్కడే చదివితే క్లాస్ రూం లు ,డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ,ప్రైవేట్ స్కూల్ లో ఏమున్నాయో అంతకు మించి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామంలో అవగాహన చేయాలి. మీ ప్రతిభ ను ఉపయోగించుకొని చొరవ తీసుకొని విద్యార్థులపై శ్రద్ధ పెట్టండి. సక్సెస్ ఫుల్ స్కూల్ గా ముందుకు పోతుంది. మా టీచర్లు 30 ఏళ్ల క్రితం చెప్పిన వారి పేర్లు కూడా మేము మర్చిపోలేదు. ఇక్కడ ప్లే గ్రౌండ్ లో అన్ని గేమ్స్ ఉంటాయి, సైన్స్ ల్యాబ్ ,కంప్యూటర్ ,రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేశాం.లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి. స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్ లు ఉంటాయి అందరూ ఆడాలని అన్నారు