మంత్రి పువ్వాడ బతుకమ్మ సంబరాలు

- Advertisement -
Minister Puvvada Bathukamma celebrations
Minister Puvvada Bathukamma celebrations

ఖమ్మం: ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ ఆయన సతీమణి వసంత లక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.  నగరంలోని 30వ డివిజన్ లో అట్ల  బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ ఆయన సతీమణి వసంత లక్ష్మిలు హాజరయ్యారు. మహిళలు, యువతులు, చిన్నారులు అంతా ఒక్కచోట చేరి ఆట పాటలతో నృత్యం చేస్తూ బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. డివిజన్ పరిధిలోని మహిళలు అంతా రావడంతో ఆ ప్రాంగణమంతా కనువిందు చేసింది. తీరు ఒక్క పువ్వులను పేర్చి చేసుకున్న బతుకమ్మలతో మహిళలంతా సందడి చేశారు. ప్రతి ఏటా డివిజన్ పరిధిలోని పోతురాజు దేవాలయ ప్రాంగణంలో బతుకమ్మను జరుపుకుంటామని, బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్ ఎంతగానో సహకరిస్తారని అన్నారు స్థానిక బి.ఆర్.ఏస్ యువజన నాయకుడు రాజేష్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular